పహల్గామ్ లో అమాయక టూరిస్ట్ లపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ దళాలు నేటి వేకువ జామున సంయుక్తంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని 9 ఉగ్రవాద లక్ష్యాలపై అత్యంత ఖచ్చితత్వంతో మిసైల్ దాడులు జరిపినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. 1971 యుద్ధం తర్వాత పాకిస్థాన్‌పై మూడు రక్షణ దళాలు కలిసికట్టుగా దాడి చేయడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. పహాల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ గట్టి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఈ సైనిక చర్యలు ప్రారంభమయ్యాయి. “భారత్‌పై ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించి, వాటిని అమలు చేస్తున్న పాకిస్థాన్ మరియు పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ఈ ఆపరేషన్ ద్వారా లక్ష్యంగా చేసుకున్నట్లు సైన్యం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఆపరేషన్ ‘సింధూర్’… పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు
By admin1 Min Read
Previous Articleముంబై జోరుకు బ్రేక్… ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ దే పైచేయి
Next Article ‘ఆపరేషన్ సింధూర్’:80మందికి పైగా ఉగ్రవాదుల హాతం