పాకిస్థాన్ తో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడులు చేసిన పాక్ ను భారత్ సమర్థంగా ఎదుర్కొంది. బోర్డర్ లోదాడులు చేసి భారత్ ను ఇబ్బంది పెట్టాలనే పాక్ దుష్ట ఆలోచనలకు చెక్ పెట్టే విధంగా చర్యలు చేపట్టనుంది. దీంతో ఆ దేశానికి అలాంటి అవకాశం ఇవ్వకుండా భారత ఆర్మీని మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత ఆర్మీ చీఫ్ కు మరిన్ని అధికారాలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని పేర్కొంది. ఇందులోని అధికారులను, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు అధికారం కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి వీరు పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది. , చీఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాల అధిపతులు, రక్షణా శాఖ కార్యదర్శులతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక సమావేశం నిర్వహించారు.
అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీ…భారత ఆర్మీ చీఫ్ కు మరిన్ని అధికారాలు
By admin1 Min Read