భారత్ – పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు ఒప్పుకున్నట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. నేటి సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ధృవీకరించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు భారత్ డీజీఎంఓకి పాక్ డీజీఎంఓ ఫోన్ చేసి కాల్పులు విరమించాలని కోరినట్లు మిస్రీ తెలిపారు. ఈనెల 12న సాయంత్రం 5 గంటలకు మరోసారి ఇరుదేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరగనున్నట్లు వివరించారు. ఈ చర్చలు ఎక్కడ జరుగుతాయన్న విషయంపై త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. మరోవైపు పాక్ మంత్రి ఇషాక్‌దర్ కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఉద్రిక్తతలు చల్లబడనున్నాయి.
భారత్-పాక్‌లతో జరిపిన చర్చలపై అమెరికా కార్యదర్శి రూబియో క్లారిటీ ఇచ్చారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌తో కలిసి ఇరుదేశాలతో చర్చలు జరిపినట్లు ప్రకటించారు. ఇరుదేశాల ప్రధానమంత్రులతో పాటు భారత్ విదేశాంగశాఖ మంత్రి జై శంకర్, అజిత్ దోవల్ తో, పాక్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్, పాక్ ఎన్ఎస్ఏ మాలిక్ తోనూ చర్చలు జరిపామన్నారు. అమెరికా దౌత్యంతో భారత్ – పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని రూబియో స్పష్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు