శత్రు దేశం పాకిస్థాన్ మరోసారి తన దుష్ట వైఖరిని అవలంభించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన కొద్ది గంటలలోనే సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. నేడు రాత్రి ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణ అవగాహనను పాక్ ఉల్లంఘించడం సరికాదన్నారు. డీజీఎంవో మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇది అత్యంత దుర్మార్గమని దుయ్యబట్టారు. కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాకిస్థాన్ దేనని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పాక్ ఉల్లంఘనలకు సైన్యం తగిన విధంగా బదులిస్తుందని పేర్కొన్నారు. పాక్ అతిక్రమణను నిలువరించేందుకు సైన్యానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికైనా ఈ ఉల్లంఘనలను పాకిస్థాన్ నిలువరిస్తుందని ఆశిస్తున్నట్టు విక్రమ్ మిస్త్రీ పేర్కొన్నారు.
Previous Articleకాల్పుల విరమణకు భారత్- పాక్ అంగీకారం
Next Article ఆర్చరీ వరల్డ్ కప్ లో భారత్ కు మరో స్వర్ణం