ఉద్యానవన సాగుతోనే రైతుకు అత్యధిక ఆదాయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి రైతు ఎకరాకు ఏడాదికి కనీసం లక్ష రూపాయలు ఆదాయం ఆర్జించడమే లక్ష్యంగా ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. హార్టీకల్చర్ పై నేడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఐదేళ్లలో సాగు రెట్టింపయ్యేలా ప్రణాళికల అమలు చేయాలని సమీక్షలో చంద్రబాబు పేర్కొన్నారు. 11 ప్రాధాన్య పంటలు – 24 క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలన్నారు. త్వరలో డ్రిప్ ఇరిగేషన్‌కు ఆటోమెషిన్ పరికరాల ఏర్పాటు. పండ్లతోటల రైతులకు సబ్సిడీపై ఫ్రూట్ కవర్ల పంపిణీ వంటి అంశాలపై మాట్లాడారు. ఈ సమావేశానికి మంత్రి కె.అచ్చెన్నాయుడు, సంబంధిత అధికారులు హాజరయ్యారు.
Previous Articleసింధూ జలాల ఒప్పందం నిలిపివేత అప్పటివరకు కొనసాగుతుంది- భారత్
Next Article ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్ లో స్మ్రతి మంథాన @2