స్కిల్ డెవలప్మెంట్ శాఖపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఐదేళ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు నైపుణ్యాభివృద్ధి శాఖలోని స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, న్యాక్, సీడాప్, ఓంక్యాప్ విభాగాలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. స్కిల్ పోర్టల్ ను సింగిల్ ప్లాట్ ఫామ్ గా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. స్కిల్ ట్రైనింగ్ తద్వారా జరిగే ఉద్యోగ కల్పనను రంగాల వారీగా ట్రాక్ చేయాలని జిల్లాల వారీగా అమలు ప్రణాళికలను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంటర్ వృత్తి విద్యల బలోపేతం ద్వారా ఉద్యోగాల కల్పనకు కృషిచేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు.
Previous Articleఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్ లో స్మ్రతి మంథాన @2
Next Article భారత జవాన్ పూర్ణమ్ కుమార్ షాను అప్పగించిన పాక్