భారత జట్టు స్టార్ క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు. దీంతో సుదీర్ఘ కాలం పాటు అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆటగాడిగా నిలిచాడు. 1,151 రోజులుగా జడేజా ఈ స్థానంలో కొనసాగుతున్నాడు. 400 పాయింట్లతో తాజా ఐసీసీ టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
ఐసీసీ టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ప్లేయర్లు:
1.రవీంద్ర జడేజా (భారత్) – 400 పాయింట్లు 2.మెహదీ హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్) – 327 పాయింట్లు 3.మార్కో యన్సెన్ (దక్షిణాఫ్రికా) – 294 పాయింట్లు 4.పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా) – 271 పాయింట్లు. 5.షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 253 పాయింట్లు 6.జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) – 249 పాయింట్లు 7.జో రూట్ (ఇంగ్లాండ్) – 247 పాయింట్లు 8.గస్ అట్కిన్సన్ (ఇంగ్లాండ్) – 240 పాయింట్లు. 9.బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) – 235 పాయింట్లు. 10.క్రిస్ వోక్స్ (ఇంగ్లాండ్) – 225 పాయింట్లు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు