ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వ పాలసీలతో పెట్టుబడులకు దేశ, విదేశీ సంస్థల ఆసక్తి చూపుతున్నాయి. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ SIPB సమావేశం జరిగింది. 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఎనర్టీ, పర్యాటకం, ఐటీ,ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు 6 ఎస్ఐపీబీల్లో 76 ప్రాజెక్టుల ద్వారా రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది. ఒప్పందాలు చేసుకున్న సంస్థల పనుల పురోగతిపై డాష్ బోర్డ్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు.
ఏపీలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు: రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
By admin1 Min Read