భారతీయ సినిమా పితామహుడు, దిగ్గజం దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో తెలుగు స్టార్ యాక్టర్ ఎన్టీఆర్ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయని వస్తున్న వార్తల ప్రకారం తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి సమర్పణలో ఎస్.ఎస్.కార్తీకేయ, వరుణ్ గుప్తా నిర్మాతలుగా నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నారని ఆ వార్తలను బట్టి తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ‘మేడ్ ఇన్ ఇండియా ‘ పేరుతో పలు భాషల్లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో కూడా దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ రానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దాదాసాహెబ్ ఫాల్కే, భారతీయ సినిమా పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన అసలు పేరు ధుందిరాజ్ గోవింద్ ఫాల్కే (1870-1944), భారతదేశంలో సినిమా పరిశ్రమకు పునాది వేసిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్. 1913లో ఆయన రూపొందించిన రాజా హరిశ్చంద్ర భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి మౌనచిత్రంగా చరిత్రలో నిలిచింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు