ప్రతి నెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏపీ లోని కూటమి ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అందరూ నెలకు ఒక రోజు స్వచ్ఛాంధ్ర కోసం పని చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇక నేడు ఈ నెలలో మూడో శనివారం సందర్భంగా కర్నూలు జిల్లా, పాణ్యంలో సీఎం చంద్రబాబు..”స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యానవనం అభివృద్ధి కోసం శంకుస్థాపన చేసి,శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
కర్నూలు జిల్లాలో “స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర” కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read