పాకిస్థాన్ ఉగ్ర కుట్రలకు ఇటీవలే ‘ఆపరేషన్ సిందూర్’ తో తగిన గుణపాఠం చెప్పిన భారత్ అంతర్జాతీయంగా కూడా పాక్ దుష్టబుద్దిని ఎండగట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. పాకిస్థాన్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడం కోసం 7 అఖిల పక్ష టీమ్ లను ఏర్పాటు చేసింది. ఆ టీమ్ లకు నాయకత్వం వహించే 7 మంది ఎంపీలను కూడా నేడు ప్రకటించింది. శశిథరూర్ -కాంగ్రెస్, రవిశంకర్ ప్రసాద్-బీజేపీ, బైజయంత్ పాండాబీజేపీ, సంజయ్ కుమార్ ఝా-జేడీయూ, కనిమొళి-డీఎంకే, సుప్రియా సూలే- ఎన్సీపీ -ఎస్పీ, శ్రీకాంత్ శిందే- శివసేన. ఈ బృందాలకు ఈ ఏడుగురు నాయకత్వం వహించనున్నారు.
మొత్తంగా 7 గ్రూపులు 10రోజుల వ్యవధిలో 5 దేశాలకు వెళ్తాయి. ఈ విషయంపై విపక్షాలతో చర్చలు జరిపి సభ్యులను ఎంపిక చేసింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఇటీవల జరిగిన పరిణామాలు, ఉగ్రవాదంపై భారత్ పోరాడుతున్న తీరు తదితర అంశాలను విదేశాలకు వివరించనున్నట్లు తెలుస్తోంది.
7 మంది ఎంపీల నాయకత్వంలో విదేశాలకు బృందాలు… భారత్ కీలక నిర్ణయం
By admin1 Min Read
Previous Articleమెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గా నయనతార
Next Article ప్రధాని మోడీని కలిసిన ఏపీ మంత్రి లోకేష్ కుటుంబం