వచ్చే సంవత్సరం నుండి అధిక సంఖ్యలో ప్రభుత్వ విద్యార్థులు ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసుకొని పనిచేస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంచి మనస్సుతో ఏ కార్యక్రమం తలపెట్టినా విజయం వరిస్తుంది. విద్యా శాఖ మంత్రి గా బాధ్యతలు తీసుకున్నప్పుడు రిస్క్ ఎందుకు అన్నవారే ఎక్కువ అని ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలి అని ఏడాది పాటు పడ్డ శ్రమ ఫలితాలను ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 47 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీపడి ర్యాంకులు సాధించడం గర్వకారణమని అందులో ఎక్కువ శాతం అమ్మాయిలే ఉండటం శుభపరిణామని అన్నారు. వారంతా షైనింగ్ స్టార్స్, ప్రభుత్వ విద్యకు వారు బ్రాండ్ అంబాసిడర్లని కొనియాడారు. విద్యా శాఖ ఉన్నతాధికారులతో కలిసి వారిని లోకేష్ సన్మానించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత మెరుగు పర్చేందుకు విద్యార్థుల ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు