తెలుగు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, విలక్షణ నటుడు రానా దగ్గుబాటి కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ మరోసారి ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ రెండో సీజన్ జూన్ 13 నుండి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా సరికొత్త హంగులతో సీజన్ 2 రూపుదిద్దుకుంది. మొదటి సీజన్ తో ఆకట్టుకున్న ఈ సిరీస్ ఇప్పుడు రెండో సీజన్ రానున్నట్లు సమాచారం రావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2023లో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో విడుదలైన ‘రానా నాయుడు’ మొదటి సీజన్, వీక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. మొదటి సీజన్ కు లాగా మరింత ఉత్కంఠభరితంగా, ఆసక్తికరమైన కథాంశంతో తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. దియా మీర్జా, అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా వంటి ప్రముఖ తారాగణం నటించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు