వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, ఆపార్టీ అధినేత వైయస్ జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సూపర్-6 హామీల అమలుపై ప్రశ్నిస్తూ సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాల్ని నిలదీస్తూ జూన్ 4 రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహించనున్నట్లు తెలిపారు. రెడ్ బుక్ పేరుతో చేస్తున్న అన్యాయాలు, అరాచకాలపై ఆరోజు అన్ని వర్గాల ప్రజలతో కలిసి గళమెత్తుతామని అన్నారు. సెకీ సంస్థతో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం ద్వారా ఏపీ ప్రభుత్వానికి దాదాపు రూ.89,675 కోట్లు ఆదా చేశామన్నారు. ఇది రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా నిలిచిందని పేర్కొన్నారు. అప్పులు తెచ్చే విషయంలో చంద్రబాబు అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఆఖరుకు రాష్ట్రంలోని గనులను సైతం తనఖా పెట్టేసి అప్పులు తెస్తున్నారు. రానున్న తరాలు చంద్రబాబు చేసిన అప్పులు తీర్చడానికి మరింత పన్నుల భారం మోయక తప్పదని ఆక్షేపించారు.
జూన్ 4 రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం: మాజీ సీఎం వైఎస్ జగన్
By admin1 Min Read