విలక్షణ నటుడు ముకుల్ దేవ్ (54) కన్నుమూశారు. తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘కృష్ణ’ మూవీలో విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. సిద్దం, బెజవాడ , భాయ్, కేడీ, నిప్పు వంటి పలు చిత్రాల్లో నటించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయి లోని ఒక హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మాస్, సీతయ్య , సింహద్రి తదితర ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించిన రాహుల్ దేవ్ కు ఈయన సోదరుడు. ముకుల్ దేవ్ మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు, సినీ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Previous Articleభారీగా షెంజెన్ వీసాల తిరస్కరణ… జాబితాలో 3వ స్థానంలో భారత్
Next Article కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు