యూరప్ దేశాల పర్యటనకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది వెళుతుంటారు. అయితే, షెంజెన్ వీసా దరఖాస్తుల్లో అధిక సంఖ్యలో రిజెక్ట్ అవుతుండడంతో అప్లికెంట్ లు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ఈ క్రమంలో భారతదేశానికి సంబంధించిన వీసా దరఖాస్తులు సైతం భారీ సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ రిజెక్షన్ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. భారత్ నుంచి వచ్చిన దరఖాస్తుల్లో 1.65 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. తద్వారా భారతీయ దరఖాస్తుదారులు దాదాపు రూ.136 కోట్లు నష్టపోయారు. యూరోపియన్ కమిషన్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
Previous Articleఅది తప్పుడు ప్రచారం… పూర్తిగా అవాస్తవం: ఏపీ ఫ్యాక్ట్ చెక్
Next Article విలక్షణ నటుడు ముకుల్ దేవ్ కన్నుమూత