నేడు దేశ రాజధాని ఢిల్లీలో నీతి ఆయోగ్ భేటీ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల సీఎంలు తదితరులు పాల్గొన్నారు. వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై ఏపీ సీఎం చంద్రబాబు నివేదిక ఇచ్చారు. పహల్గాం దాడిని ఖండిస్తూ, ఆపరేషన్ సింధూర్ గురించి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో సాధించిన అభివృద్ధి దేశ, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే వివిధ అంశాలను తన ప్రజెంటేషన్లో వివరించారు. ఏపీలోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వివరించారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వికసిత్ భారత్ స్వప్నం సాకారంతో స్వర్ణాంధ్రను సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. రాష్ట్ర వనరుల సద్వినియోగంపైనా సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ లో పేర్కొన్నారు.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో విశాఖను తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. విశాఖకు జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు. విశాఖ మోడల్ విస్తరణకు కేంద్రం సహకరించాలని కోరారు. అమరావతి, తిరుపతి, గోదావరి, కర్నూలుకు విశాఖ మోడల్ విస్తరిస్తామన్నారు, క్వాంటమ్ వ్యాలీ, డ్రోన్ సిటీ ప్లాన్లను ప్రజెంటేషన్ లో వివరించారు. కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్‌బుక్ విధానం తెస్తామని, మెటర్నిటీ లీవ్స్ 180 రోజులకు పెంచినట్టు సీఎం తన ప్రజెంటేషన్లో వివరించారు. జిల్లా, నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుటుంబానికి ఓ ఇండస్ట్రీయలిస్ట్ వచ్చేలా విధానాలు రూపొందిస్తున్నామని వివరించారు.
2029 నాటికి పేదరిక నిర్మూలన లక్ష్యంగా పని చేస్తున్నామని, పీ4 మోడల్ ద్వారా బంగారు కుటుంబాలకు మార్గదర్శుల ద్వారా సహాయం చేస్తున్నామని తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్‌లో భాగంగా గూగుల్ ఏఐ వంటి టెక్నాలజీలను వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. వికసిత్ భారత్-2047 దిశగా అభివృద్ధి వేగవంతానికి 3 కమిటీలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ సహకారంతో సీఎంలతో 3 కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
పీపీపీ ప్రాజెక్టుల కోసం సెంట్రల్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌పై కమిటీ ప్రతిపాదించారు. అదేవిధంగా వృద్ధాప్యం, తక్కువ సంతానోత్పత్తి వంటి సవాళ్లపైనా అధ్యయనానికి, సాంకేతికతతో నడిచే పాలనపై దృష్టి పెట్టడానికి ఒక కమిటీ వేయాలని సూచించారు. ఏపీ గ్రోత్ బ్లూ ప్రింట్‌పై నీతిఆయోగ్ వేదికగా ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఏపీ ప్రభుత్వం సంస్కరణలపై ప్రశంసించారు . ఏపీ సంస్కరణలను అన్ని రాష్ట్రాలు పరిశీలించి, అధ్యయనం చేయాలన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు