ఐపీఎల్ సీజన్ 18 మొదటి మ్యాచ్ లలో సత్తా చాటిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తరువాత కీలక మ్యాచ్ లలో ఓడి ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తమ ఆఖరి మ్యాచ్ లో గెలిచి విజయంతో ఈ సీజన్ కు గుడ్ బై చెప్పేసింది. తాజాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 53 (34; 5×4, 2×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. స్టోయినీస్ 44 నాటౌట్ (16; 3×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లిస్ (32), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (28) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో ఎం.రెహ్మాన్ 3 వికెట్లు, విప్రజ్ నిగమ్ 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, ముకేష్ కుమార్ ఒక వికెట్ తీశారు. అనంతరం టార్గెట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19.3 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రిజ్వీ 58 నాటౌట్ (25; 3×4, 5×6) కీలక ఇన్నింగ్స్ తో టీమ్ ను విజయ తీరాలకు చేర్చాడు. కరుణ్ నాయర్ 44 (27; 5×4, 2×6), కే.ఎల్.రాహుల్ 35 (21; 6×4, 1×6), డుప్లెసిస్ 23 (15; 2×4, 1×6), అటల్ (22), స్టబ్స్ (18 నాటౌట్) పరుగులు చేశారు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హార్ ప్రీత్ బ్రార్ 2 వికెట్లు, జాన్సన్ ఒక వికెట్, దూబే 1 వికెట్ తీశారు.
గెలుపుతో గుడ్ బై చెప్పిన ఢిల్లీ క్యాపిటల్స్… పంజాబ్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం
By admin1 Min Read