సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలతో ఐపీఎల్ సీజన్ 18కు వీడ్కోలు పలికింది. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 110 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి తమ అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 278 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ చరిత్రలో టాప్ 5 హైయెస్ట్ స్కోర్ల రికార్డు ఆ టీమ్ పేరిట ఉండడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగారు. హెన్రిచ్ క్లాసిన్ 105 (39; 7×4, 9×6) సెంచరీతో అదరగొట్టాడు. ట్రావిస్ హెడ్ 76 (40; 6×4, 6×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. అభిషేక్ శర్మ 32 (16; 4×4, 2×6), ఇషాన్ కిషన్ (29) పరుగులు చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో నరైన్ 2 వికెట్లు, వైభవ్ అరోరా 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్ కతా 168 పరుగులకే కుప్పకూలింది. మనీష్ పాండే (37), హార్షిత్ రాణా (34), సునీల్ నరైన్ (31) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఉనద్కత్ 3 వికెట్లు, ఎషాన్ మలింగ 3 వికెట్లు, హార్ష్ దూబే 3 వికెట్లు పడగొట్టారు.
హ్యాట్రిక్ విజయాలతో సీజన్ ముగించిన సన్ రైజర్స్…కోల్ కతా నైట్ రైడర్స్ పై భారీ విజయం
By admin1 Min Read