తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘మహానాడు’ కడప వేదికగా నేడు ప్రారంభమైంది. మహానాడు ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి మహా పండుగను టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మహానాడు ప్రాంగణంలో టీడీపీ జెండా ఎగురవేశారు. దేశవ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులు, నేతలు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అని మాట్లాడిన వారి పని అయిపోయిందే కానీ, పార్టీ మాత్రం వెనక్కు తిరిగి చూడలేదని ఈసందర్భంగా చంద్రబాబు అన్నారు. ఈ జెండా ఎప్పుడూ రెపరెపలాడుతూనే ఉంటుంది. చైతన్యరథం నుంచి వస్తున్నా మీకోసం, యువగళం వరకు పార్టీ కార్యకర్తల్లో అదే స్ఫూర్తి.గత ప్రభుత్వం పాలన అంటే వేధింపులు, తప్పుడు కేసులని మార్చేసిందని దుయ్యబట్టారు. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ప్రశ్నించిన నాయకులను వెంటాడి ప్రాణాలు తీశారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి వేధించారు. ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేశారే తప్ప వెనుకడుగు వేయలేదని కొనియాడారు. పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అంటూ చంద్రయ్య ప్రాణాలు వదిలేశారు. ఆశయ సాధన కోసం రాజీలేని పోరాటాలు చేసిన వారిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇచ్చి సంక్షేమం అందిస్తామని స్పష్టం చేశారు.
చైతన్యరథం నుంచి వస్తున్నా మీకోసం, యువగళం వరకు పార్టీ కార్యకర్తల్లో అదే స్ఫూర్తి: టీడీపీ అధినేత చంద్రబాబు
By admin1 Min Read