మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుకని మహానాడు… ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనేని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ స్పందించారు. తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు ప్రత్యేకతను గుర్తుచేస్తూ పవనన్న అందించిన ప్రశంసలు స్పూర్తినిచ్చాయి. కష్టసుఖాల్లో అండగా ఉంటూ మీరు అందిస్తున్న ప్రోత్సాహం మాకు కొండంత బలం. మీ సహాయ, సహకారాలతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాం. థాంక్యూ పవనన్నా! అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
Previous Articleమహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక: ఏపీ డిప్యూటీ సీఎం పవన్
Next Article సింగపూర్ ఓపెన్ లో సింధు, ప్రణయ్ శుభారంభం