14 ఏళ్ల తర్వాత తెలంగాణలో సినిమా అవార్డులను నేడు ప్రకటించారు. గద్దర్ పేరిట ఇవ్వనున్న ఈ అవార్డులును జ్యూరీ ఈరోజు ప్రకటించింది. కమిటీ ఛైర్మన్ జయసుధ, FDC ఛైర్మన్ దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ అవార్డుల ఎంపికపై తమకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని తమ కమిటీ ఏకగ్రీవంగా అవార్డులను ఎంపిక చేసిందని జయసుధ తెలిపారు.
2024 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్:
కల్కి 2898ఏడీ (మొదటి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్)
పొట్టేల్ (రెండో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్)
లక్కీ భాస్కర్ (మూడో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్)
ఉత్తమ నటీనటులు:
ఉత్తమ నటుడు- అల్లు అర్జున్ (పుష్ప 2) ఉత్తమ నటి- నివేదా థామస్ (35 ఇది చిన్న కాదు). ఉత్తమ దర్శకుడు- నాగ్ అశ్విన్ (కల్కి). ఉత్తమ సహాయ నటుడు: ఎస్ సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్), ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్ (రజాకార్), ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప 2), ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన), ఉత్తమ హాస్యనటులు- సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2), ఉత్తమ బాలనటులు- మాస్టర్ అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), బేబీ హారిక ఉత్తమ కథా రచయిత- శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి), ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత- వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్ (రాజూ యాదవ్), ఉత్తమ సినిమాటోగ్రాఫర్- విశ్వనాథెడ్డి (గామి).