భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) పై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న ప్రజలు మనవాళ్లే అని అక్కడి ప్రజలతో ధృఢమైన సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భౌగోళికంగా విడిపోయిన పీవోకే ప్రజలు ఏదో ఒకరోజు భారత్ లో ఏకమవుతారని ఆరోజు ఎంతో దూరంలో లేదని స్పష్టం చేశారు. పీవోకే తిరిగి వస్తుందన్నారు. అక్కడ కొందరు మాత్రమే తప్పు దారి పట్టారని అన్నారు. గ్రేట్ ఇండియా మన విధానమని చెప్పారు. శక్తితో పాటు సంయమనం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. ఇక ఆపరేషన్ సిందూర్ తో దేశ భద్రతకు మేకిన్ ఇండియా ముఖ్యమని రుజువైంది. మనం ఇప్పుడు ఫైటర్ జెట్స్, మిస్సైల్స్ సిస్టమ్స్ నిర్మించడంతో పాటు కొత్త తరం వార్ టెక్నాలజీపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ అవలంబించిన తీరును వివరించారు. కేవలం 23 నిమిషాలలో పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం తుడిచిపెట్టేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పాకిస్థాన్ ను ఇప్పటికే ఆయన పలు సందర్భాల్లో హెచ్చరించారు.
పీవోకే ప్రజలు మనోళ్లే…ఏదో ఒక రోజు భారత్ లో ఏకమవుతారు: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
By admin1 Min Read