వైసీపీపై ఏపీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. అబ్బే వాళ్ళేమీ మారలేదు….. వాళ్ళేమీ మారరు కూడా….. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో… ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారని సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో చిన్న పిల్లవాడి చేతిలో నుండి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ విరగ్గొడుతూ వైసీపీ మద్దతుదారులు కొందరు కొంత వికృతంగా ప్రవర్తించడం అందులో కనిపిస్తుంది. వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింత గా అర్థం చేసుకోవాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అందుకే నాటికి నేటికీ ఎప్పటికీ అదొక సైకో పార్టీ… వాళ్ళకి సైకో నాయకుడు! ప్రజలు బుద్ధి చెప్పినా మారలేదని దుయ్యబట్టారు. మైలవరం లో ఓ మాజీ మంత్రి ఇంట్లో శుభకార్యానికి వచ్చి వాళ్ళు చేసిన పిచ్చి చేష్టలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
#PsychoJagan #YSRCPRowdyism
అబ్బే వాళ్ళేమీ మారలేదు….. వాళ్ళేమీ మారరు కూడా….. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో… ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికి నేటికీ ఎప్పటికీ అదొక సైకో పార్టీ… వాళ్ళకి సైకో నాయకుడు! ప్రజలు బుద్ధి చెప్పినా మారని… pic.twitter.com/8fKlFYmG2o— Lokesh Nara (@naralokesh) June 1, 2025