మిస్ వరల్డ్ 2025గా థాయ్ లాండ్ కు చెందిన ఓపల్ సుచాత నిలిచింది. మొదటి రన్నరప్ గా ఇథియోపియాకు చెందిన హాసెట్ డెరెజే, రెండో రన్నరప్ మిస్ పోలండ్ మయా క్లౌడా, మూడో రన్నరప్ గా మార్టినిక్ సుందరి ఆరేలి జోచిమ్ నిలిచారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జూలియా మోర్లే ప్రకటించారు. హైదరాబాద్లోని హైటెక్స్ లో శనివారం ఉత్కంఠభరితంగా ఫైనల్స్ జరిగాయి. ప్రపంచ సుందరిగా గెలిచిన థాయ్ లాండ్ భామ ఓపల్ సుచాతకు మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్కోవా కిరీటాన్ని అలంకరించారు. సుచాతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. 21 ఏళ్ల సుచాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టూడెంట్, మోడల్. 2024 మిస్ యూనివర్స్ థాయ్ లాండ్ పోటీల్లో థర్డ్ రన్నరప్ గా నిలిచిన ఆమెకు కొద్దిలో కిరీటం మిస్సైంది. ఈసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. థాయ్ లాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మొదటి వ్యక్తిగా నిలిచింది . భారత్ తరపున పోటీల్లో పాల్గొన్న నందిని గుప్తాకు నిరాశే ఎదురైంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు