18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ ఐపీఎల్ ట్రోఫీని మొట్టమొదటి సారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కైవసం చేసుకుంది. అభిమానుల చిరకాల కోరికను ఈ సీజన్ లో నెరవేర్చి టైటిల్ విజేతగా అవతరించింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ భరిత ఫైనల్ మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు… నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (43; 35 బంతుల్లో 3×4) పరుగులు చేయగా.. ఫిల్ సాల్ట్ (16; 9 బంతుల్లో 2×4, 1×6) మయాంక్ అగర్వాల్ (24, 18 బంతుల్లో 2×4,1×6), రజత్ పాటిదార్ (26; 16 బంతుల్లో 1×4, 2×6), లివింగ్ స్టన్ (25; 15 బంతుల్లో 2×6), రొమారియో షెఫర్డ్ (17,9 బంతుల్లో 1×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జితేశ్ శర్మ (24; 10 బంతుల్లో 2×4, 2×6) పరుగులు చేశారు. పంజాబ్ బౌలరల్లో జెమీసన్, అర్ష్దీప్ సింగ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా అజ్మతుల్లా, యుజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 184/7కే పరిమితమైంది. శశాంక్ సింగ్ 61 నాటౌట్ (30; 3×4, 6×6) చివరి వరకు పోరాడాడు. ఇంగ్లీస్ 39 (23; 1×4, 4×6), ప్రభ్ సిమ్రాన్ సింగ్ 26 (22; 2×6), ప్రియాన్షు ఆర్య 24 (19; 4×4) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు, కృనాల్ పాండ్య 2 వికెట్లు, హేజల్ వుడ్, షెపర్డ్, యష్ దయాళ్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
Previous Articleవిపత్తు నిర్వహణకు స్పేస్ టెక్నాలజీ సాయం…ఇస్రో-ఆర్టీజీఎస్ ఒప్పందం
Next Article ఐపీఎల్ ఈ సీజన్ అవార్డుల జాబితా..!