18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మొదటి సారి టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ విజయోత్సవ కార్యక్రమం లో విషాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ క్రమంలో స్టేడియం వద్దకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్-2 నుండి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు.
అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని వివిధ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
Previous Articleయువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కు అందించిన మంత్రి లోకేష్
Next Article అర్జున్ విజయం… అగ్రస్థానంలో కొనసాగుతున్న హాంపి