యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సచివాలయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ అందజేశారు. పవనన్నతో పాటు, ఇతర మంత్రులకు కూడా పుస్తకాన్ని అందజేశానని లోకేష్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృతమైందని పవనన్న అన్నారు. ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తీసుకురావడాన్ని ప్రశంసించారు. ఈ రోజుకి అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికి జనం మర్చిపోలేదన్నారు. యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను ఈ సందర్భంగా పవనన్నతో పంచుకున్నానని లోకేష్ పేర్కొన్నారు.
యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కు అందించిన మంత్రి లోకేష్
By admin1 Min Read