అగ్ర కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘OG’. పవన్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ స్థాయిలో ఆకట్టుకుని అంచనాలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా షూటింగ్ లొకేషన్ లో నటుడు అర్జున్ దాస్ హీరో పవన్ కళ్యాణ్ తో దిగిన పిక్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రియాంక అరుళ్ మోహన్ పవన్ సరసన నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి ప్రజా సేవలో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘OG’ నుండి ఈ వార్త రావడంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు