సీనియర్ క్రికెటర్, స్పిన్నర్ పియూష్ చావ్లా అన్ని రకాల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2007 టీ 20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమ్ లో చావ్లా కూడా సభ్యుడు. 2007 నుండి టీమ్ ఇండియాకు 3 టెస్టులు, 25 వన్డేలు, 7 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 3 ఫార్మాట్లలో కలిపి చావ్లా 43 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో 4 జట్లకు ఆడి192 మ్యాచ్లో 192 వికెట్లు తీశాడు. 2014 ఐపీఎల్ విజేతగా నిలిచిన కోల్ కతా టీమ్ లో అతను సభ్యుడు. ఫైనల్లో విన్నింగ్ షాట్ కొట్టింది అతనే కావడం గమనార్హం. రెండు దశాబ్దాల దేశవాళీ కెరీర్లో చావ్లా వెయ్యికి పైగా వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అన్ని రకాల క్రికెట్ నుండి రిటైరవుతున్న నేపథ్యంలో ఇది తనకు తీవ్ర భావోద్వేగాన్ని కలిగించే రోజని రెండు దశాబ్దాలకు పైగా మైదానంలో ఉండి ఇక ఈ అందమైన ఆట నుంచి తప్పుకొనే సమయం వచ్చిందని చెప్పాడు.
క్రీజుకు దూరం అయినా తనలో క్రికెట్ శాశ్వతంగా ఉంటుంది. ఆట నుంచి నేర్చుకున్న పాఠాలు, స్ఫూర్తిని కొనసాగిస్తూ కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. భారత జట్టుకు అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లలో భాగం కావడం.. ఇలా తన ప్రయాణంలో ప్రతి విషయాన్నీ ఒక వరంలా భావిస్తానని అన్నాడు. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. ఐపీఎల్ కూడా ఒక ప్రత్యేక అధ్యాయం. తనకు అవకాశమిచ్చిన పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైటైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లకు కృతజ్ఞతలు తెలిపాడు. తాను ఎంచుకున్న దారిలో నడిపించిన తన దివంగత తండ్రిని ఈ సందర్భంగా స్మరించుకున్నాడు. ఆయన లేకుంటే ఇదంతా సాధ్యమయ్యేది కాదని చావ్లా పేర్కొన్నాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు