నేడు బక్రీద్ పండుగ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ‘ఈద్ ముబారక్’. త్యాగ బుద్ధిని, నిజమైన భక్తిప్రపత్తులు కలిగి ఉన్నవారే దైవకృపకు పాత్రులు అవుతారు అనే సూక్తిని బక్రీద్ మనకు తెలియజేస్తోంది. నేటి ఆధునిక కాలంలో సాటి మనిషిని ప్రేమించేవారే నిజమైన దైవభక్తులుగా చెప్పవచ్చు. హజ్రత్ ఇబ్రహీం స్ఫూర్తిగా అందరూ సాటివారిని ఆదరిస్తూ సహృదయంతో ముందుకు సాగాలని ‘బక్రీద్’ సందర్భంగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ‘ఈద్ ముబారక్’: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read