సీనియర్ అగ్ర కధానాయకుడు బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా చిత్ర బృందం అభిమానులకు అదిరే సర్ప్రైజ్ ఇచ్చింది. వారంతా ఎదురుచూస్తున్న ‘అఖండ-2’ కు సంబంధించిన సూపర్ గిఫ్ట్ ను కానుకగా ఇచ్చింది.
బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్, తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి దుమ్మరేపే విధంగా ఉన్నాయి. బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘అఖండ’కు సీక్వెల్ ఇది. సంయుక్త, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా సందర్భంగా సెప్టెంబరు 25న ఈ సినిమా విడుదల కానుంది.
Previous Articleఅన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనికి స్థానం..!