భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీకి మరో అరుదైన గౌరవం లభించింది. క్రికెట్ కు అతను చేసిన సేవలను ఐసీసీ గుర్తించింది. ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనికి స్థానం దక్కింది. ఐసీసీ ఆల్ హాఫ్ ఫేమ్ లో ఐసీసీ కొత్త ఏడుగురిని చేర్చింది. ఆస్ట్రేలియా నుంచి మాథ్యూ హేడెన్, సౌతాఫ్రికా నుంచి హషీమ్ ఆమ్లా, గ్రేమ్ స్మిత్, న్యూజిలాండ్ నుండి డేనియల్ వెట్టోరిలను ఎంపిక చేసింది. అదే విధంగా ఇద్దరు మహిళా క్రికెటర్లు సనా మిర్ (పాకిస్తాన్), సారా టేలర్(ఇంగ్లాండ్) కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. భారత క్రికెట్ కు ధోనీ విశేష కృషి చేశాడు. ధోనీ నాయకత్వంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్(2007), వన్డే వరల్డ్ కప్(2011), చాంపియన్స్ ట్రోఫీ (2013) లను గెలిచింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 538 మ్యాచ్లు ఆడిన ధోనీ 17,266 రన్స్ చేశాడు. అలాగే, 829 అవుట్లు చేశాడు. ‘ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ నా పేరు చేర్చడం నిజంగా గౌరవంగా ఉందని ధోనీ తెలిపాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేరిన 11వ భారత క్రికెటర్ ధోనీ. ధోనీకంటే ముందు నీతూ డేవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, డైన ఎడుల్జీ, వినోద్ మన్కడ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీ, సునీల్ గవాస్కర్ ఈ గౌరవం పొందారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు