అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చారు. నిన్న ఉదయం హైదరాబాద్ లో ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాత్రి 10 గంటలకు గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చారు. ఈరోజు ఉదయం అక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య గుంటూరు జీజీహెచ్ కు తీసుకెళ్లారు. అక్కడ మెడికల్ టెస్ట్ లు నిర్వహించారు. అనంతరం కొమ్మినేనిని మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చారు.
నాలుగు రోజుల కిందట సాక్షి టీవీ ఛానెల్లో ప్రసారమైన ‘కేఎస్ఆర్ లైవ్ షో’లో అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యల్ని ఖండించకపోగా వాటిని కొనసాగించేందుకు మరింత ఊతమిచ్చారని అనుచిత వ్యాఖ్యలపై గత రెండురోజులుగా రాష్ట్రమంతటా మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్న విషయం తెలిసిందే.
Previous Articleఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనికి స్థానం..!
Next Article ఇంటర్నేషనల్ క్రికెట్ కు పూరన్ గుడ్ బై