అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (ఏఎంఏ) 180వ అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన ప్రముఖ ఒటోలారింగాలజిస్ట్ (చెవి, ముక్కు, గొంతు నిపుణుడు) డాక్టర్ బాబీ ముక్కామల, ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా వైద్య రంగంలోనే ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఒక భారతీయ మూలాలున్న వ్యక్తి ప్రతిష్టాత్మక సంస్థకు నాయకత్వం వహించడం పట్ల ప్రవాసాంధ్రులతో పాటు భారతీయులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈనెల 10న చికాగోలో జరిగిన ఏఎంఏ వార్షిక సమావేశంలో కుటుంబ సభ్యులు, సహచరులు, మాజీ నాయకుల సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఎన్నో పెను సవాళ్లను అధిగమించి మరీ ఆయన ఈ స్థాయిలో నిలిచారు. గతంలో ఏఎంఏ ఫౌండేషన్ వారి “ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్” లీడర్‌షిప్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్‌కు ఎన్నికై, 2016-17లో దానికి ఛైర్‌గా పనిచేశారు. అనంతరం 2017, 2021లలో ఏఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌కు ఎన్నికయ్యారు.
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ బాబీ ముక్కామల నియామకం
By admin1 Min Read