ఇటీవల ఏపీ లోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ‘తల్లికి వందనం’ కార్యక్రమం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తల్లుల ఖాతాల్లోకి ఆ నగదును జిమ్ చేస్తోంది. కాగా, ఈ సంక్షేమ కార్యక్రమంపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించి సవాల్ విసిరారు. కాగా , ఆయన చేసిన సవాల్ గడువు ముగియడంతో మంత్రి నారా లోకేష్ మరోసారి తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. కాస్తా ఘాటుగా వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! బురద చల్లడం పారిపోయి ప్యాలెస్‌లో దాక్కోవడం జగన్ గారికి అలవాటు. తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వెళ్ళాయి అంటూ చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలని ఛాలెంజ్ చేసాను. సమయం ముగిసింది, రుజువు చెయ్యలేదు, క్షమాపణ కోరలేదు. అందుకే మిమ్మల్ని ఫేకు జగన్ అనేది. లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. సమయం లేదు మిత్రమా! శరణమా..న్యాయ సమరమా? తేల్చుకోండి.. అంటూ పోస్ట్ చేశారు.
Previous Articleఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో హైలెవల్ కమిటీ
Next Article ఘనంగా గద్దర్ అవార్డుల వేడుక