భారత ప్రధాని నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన కోసం నేడు బయలుదేరి వెళ్లారు. కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. కెనడాలో మూడు రోజులపాటు జరిగే జీ7 సదస్సుకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఇటీవల జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయిల్ పరిణామాల నేపథ్యంలో జీ7 సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది. కెనడా ప్రధాని పిలుపుతో జీ7 సదస్సుకు హాజరుకావాలని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. కెనడాలో మంగళవారం జరగనున్న జీ7 దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొంటారు. ప్రపంచంలోని ఏడు ప్రధాన పారిశ్రామిక దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ సభ్యులుగా ఉన్న ఈ కూటమి సమావేశంలో పలు అంతర్జాతీయ, ఆర్థిక, రాజకీయ అంశాలపై చర్చలు జరగనున్నాయి. నేడు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. రెండు దశాబ్దాలకు పైగా సైప్రస్ లో భారత ప్రధాని తొలిసారి పర్యటించనున్నారు. 18వ తేదీన క్రొయేషియా అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ కానున్నారు.
Previous Articleఘనంగా గద్దర్ అవార్డుల వేడుక
Next Article ఆద్యంతం ఆసక్తికరంగా ‘రాజాసాబ్’ టీజర్