ఛత్తీస్ ఘడ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన దంతెవాడ జిల్లాలో క్రీడా మైదానాలు అభివృద్ధి కోసం భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కృషి చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్, మాన్ దేశీ ఫౌండేషన్ లతో కలిసి అధికారులు ఈ జిల్లాలో 50 మైదానాలు అభివృద్ధి చేయనున్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే 20 క్రీడా మైదానాలు అభివృద్ధి చేశాం. అక్టోబర్ నాటికి మిగిలిన వాటిని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. పిల్లలు, యువత కోసం సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ మాన్ దేశీ ఫౌండేషన్ ల సహాకారంతో ఈ మైదానాలు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 50 గ్రామాల్లో 50 మైదానాలు అభివృద్ధి చేస్తామని తర్వాత జిల్లా అంతా చేయనున్నట్లు తెలిపారు.
క్రీడా మైదానాలు అభివృద్ధి కోసం భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కృషి
By admin1 Min Read