భారత్-కెనడాల మధ్య సంబంధాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ప్రజాస్వామ్య విలువలను పటిష్టం చేసేందుకు రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కెనడాలోని ఆల్బెర్టాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కెనడా ప్రధాని మార్క్ కార్నీని కలిశారు. గత ఏడాది అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో క్షీణించిన సంబంధాలు తాజా ద్వైపాక్షిక బలోపేతమవుతాయని ఈసందర్భంగా భారత్ భావిస్తోంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు భారత ప్రధాని మోడీ ఆల్బెర్టాకు వెళ్లారు. భారత్ కు జీ7 దేశాలలో సభ్యత్వం లేదు. అయినా సమావేశాలకు కెనడా ఆహ్వనం మేరకు భారత్ హాజరయ్యింది.
భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేసేందుకు పలు రంగాలలో కొనసాగుతున్న భాగస్వామ్యాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాధినేతలు కలుసుకున్న సమయంలో ప్రధాని మోడీ భారత్-కెనడాల మధ్య సంబంధాలు ఎంతో కీలకమైనవని స్పష్టం చేశారు. ప్రధాని మోడీకి ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన గొప్ప గౌరవం అని కార్నీ అన్నారు. ఫ్యూయెల్ సెక్యూరిటీ, ఏఐ భవిష్యత్తులతో పాటు ఉగ్రవాదంపై కలిసిపోరాడాలని కెనడా ప్రధాని అన్నారు.
భారత్-కెనడా మధ్య సంబంధాలు మరింత పటిష్టం:నరేంద్ర మోడీ, మార్క్ కార్నీ భేటీ
By admin1 Min Read

