ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా; పర్యావరణ, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి నేటికి సంవత్సరం పూర్తైన సందర్భంగా ప్రజలు NDA కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ, గత సంవత్సర కాలంలో శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలతో పంచుకోవాలని, ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో సమగ్ర అభివృద్ధి నివేదికను డిప్యూటీ సీఎం కార్యాలయం విడుదల చేసింది. ప్రజలందరూ ఈ నివేదిక ద్వారా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారని పేర్కొంది. రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో, సీఎం చంద్రబాబు నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధతతో NDA ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచెయ్యనుందని ఒక ప్రకటనలో తెలిపింది.
సమగ్ర అభివృద్ధి నివేదిక 2024-2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా; పర్యావరణ, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖ మంత్రిగా @PawanKalyan బాధ్యతలు చేపట్టి నేటికి సంవత్సరం పూర్తైన సందర్భంగా ప్రజలు NDA కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న… pic.twitter.com/UwphiI9PIS
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) June 19, 2025