శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మళ్లీ వాయిదా పడింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ నెల 22న ఈ అంతరిక్ష యాత్ర ఉంటుందని ఇటీవల ఇస్రో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ యాక్సియం-4 ప్రయోగం వాయిదా పడినట్లు నాసా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. యాక్సియం-4 కింద మరో ముగ్గురు ఆస్ట్రోనాట్ లతో కలిసి ఈ యాత్రను శుభాంశు శుక్లా చేయనున్నారు. అమెరికాకి చెందిన ఒక కమర్షియల్ స్పేస్ సంస్థ ఈ యాత్ర నిర్వహిస్తోంది. భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ క్యాప్సుల్ ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి తీసుకెళ్లనుంది. ఇందులో శుభాంశు మిషన్ పైలెట్ గా ఉంటారు. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో శుభాంశు టీమ్ 14 రోజులు ఉండనుంది.
శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా… త్వరలో కొత్త తేదీ ప్రకటన
By admin1 Min Read