భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఈరోజు నుండి మొదలవుతుంది. ఈ సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీని ఇక నుండి ‘అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ’గా పిలుస్తారు. బీసీసీఐ-ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించింది. తాజాగా తొలి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో ఈ ట్రోఫీని అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, జేమ్స్ అండర్సన్ పాల్గొన్నారు. ఇప్పటిదాకా ఇంగ్లాండ్ లో జరిగే సిరీస్ విజేతకు పటౌడీ పేరుతో ట్రోఫీ అందించేవారు. ఈ రెండు జట్లు భారత్లో తలపడితే ‘ఆంథోని డి మెల్లో’ ట్రోఫీ ప్రదానం చేసేవాళ్లు. ఇటీవలే భారత్-ఇంగ్లాండ్ బోర్డులు పటౌడీ ట్రోఫీని రిటైర్ చేశాయి. ఇక భారత్ లో ఆడినా.. ఇంగ్లాండ్ లో ఆడినా రెండు జట్ల మధ్య సిరీస్ విజేతకు ‘అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీనే ఇవ్వనున్నారు. విజేత జట్టు కెప్టెన్ కు ‘పటౌడీ మెడల్’ను బహూకరిస్తారు. ట్రోఫీపై టెండూల్కర్, అండర్సన్ యాక్షన్ ఫొటోలతో పాటు వారి సంతకాలు ఉన్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు