ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్, సీఈవో పావెల్ డ్యూరోవ్ తన భారీ సంపదకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వీర్యదానం ద్వారా జన్మించిన 100 మందికిపైగా పిల్లలు సహా తన వారసులకు 13.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.16 లక్షల కోట్లు) సంపదను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఫ్రాన్స్‌కు చెందిన ఒక ప్రముఖ
మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర విషయాలను తెలిపారు. అతనికి కలిగిన ఆరుగురు పిల్లలతో పాటు, గత 15 ఏళ్లుగా వీర్య దానం ద్వారా 12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలకు తండ్రయ్యాడు. ఈ నేపథ్యంలో తన సంపదను పంచుతూ ఇటీవలే వీలునామా రాసినట్టు తెలిపారు. తన పిల్లల విషయంలో ఎలాంటి తేడా చూపించనని అన్నారు. సహజంగా జన్మించినవారు, స్పెర్మ్ దానం ద్వారా జన్మించినవారు అందరూ తన పిల్లలేనని. వారందరికీ సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. తన మరణం తర్వాత వారు గొడవ పడకూడదన్నదే నా కోరికని డ్యూరోవ్ ‘లీ పాయింట్’ కు వివరించారు.
తన వీర్య దానంతో పుట్టిన పిల్లలకు కూడా ఆస్తి…టెలిగ్రామ్ సీఈఓ పావెల్ కీలక నిర్ణయం
By admin1 Min Read