భారతీయ సంస్కృతి, వారసత్వాలకు స్థానిక భాషలే నిజమైన గుర్తింపునిస్తాయని, విదేశీ భాషల స్థానాన్ని అవి భర్తీ చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఇంగ్లీష్ ను వలసవాద బానిసత్వానికి ప్రతీకగా అభివర్ణించారు. భవిష్యత్తులో ఇంగ్లీష్ మాట్లాడేవారే సిగ్గుపడే పరిస్థితి వస్తుందని, ప్రజలే ఆ భాషను తిరస్కరించే రోజులు సమీపంలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆకాంక్షించారు. తాజాగా ఢిల్లీలో ఐఏఎస్ అధికారి అశుతోష్ అగ్నిహోత్రి హిందీలో రచించిన ‘మై బూంద్ హూ.. ఖుద్ సాగర్ హూ’ (నేను నీటి బిందువునే కాదు.. సముద్రాన్ని కూడా) అనే పుస్తకావిష్కరణ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి, సంస్కృతికి, చరిత్రకు, మతానికి సంబంధించిన విషయాలను అర్థం చేసుకోవడానికి ఏ విదేశీ భాష సరిపోదన్నారు. అసంపూర్ణమైన విదేశీ భాషలతో ‘సంపూర్ణ భారతం’ అనే భావనను ఊహించలేమని అన్నారు.
ఇంగ్లీష్ లో మాట్లాడే వారు సిగ్గు పడే రోజులొస్తాయి: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
By admin1 Min Read