టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టులో నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 364 పరుగులకు (96 ఓవర్లు) ఆలౌటయింది. కే.ఎల్. రాహుల్ 137 (247; 18×4) టాప్ స్కోరర్. మొదటి ఇన్నింగ్స్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో సెంచరీ చేసిన రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ సాధించి ఈ ఘనత అందుకున్న మొదటి భారత బ్యాటర్ గా నిలిచాడు. అంతే కాకుండా రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్ గా నిలిచాడు. ఇంతకుముందు జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ ఆండీ ఫ్లవర్ ఈ ఫీట్ సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో 118 (140; 15×4, 3×6) పరుగులు చేశాడు. జడేజా (25), కరుణ్ నాయర్ (20) పరుగులు చేశారు. దీంతో భారీ టార్గెట్ ను భారత్ ఇంగ్లాండ్ ముందుంచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో కార్సే 3 వికెట్లు, టంగ్ 3 వికెట్లు, బషీర్ 2 వికెట్లు, వోక్స్, స్టోక్స్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులతో ఉంది. క్రాలీ 12, డకెట్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
సెంచరీలతో చెలరేగిన కే.ఎల్.రాహుల్, రిషబ్ పంత్ … ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం
By admin1 Min Read
Previous Articleప్రతివారినీ సమానంగా చూడటం ధర్మం:మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్
Next Article నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?