మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తమిళనాడు బీజేపీ అగ్రనేతలు, ఆధ్యాత్మిక గురువులు, సాధువులు లక్షలాది ప్రజలు ఈ సభలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. 2014 లో హైదరాబాద్ లో పార్టీ స్థాపించాను… నేను తమిళనాడు లో పెరిగాను, తమిళనాడు లో సంస్కృతిని అర్ధం చేసుకున్నవాడిని, తమిళనాడు సంస్కృతిపై గౌరవాన్ని పెంచుకున్నవాడిని, ఏథెన్స్ కంటే ప్రాచీనమైన మధురై నగరంలో ఇన్ని లక్షల ప్రజల మధ్య, హిందూ సాధువుల మధ్య మాట్లాడుతానని ఎప్పుడూ ఊహించలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ధర్మం అంటే ఏంటి? దుష్ట శక్తులను తొలగించడం ధర్మం. ప్రతివారినీ సమానంగా చూడటం ధర్మం. దుష్టులను శిక్షించడం ధర్మమని పేర్కొన్నారు.మురుగన్‌ను నమ్మితే విజయం తధ్యం. మురుగన్‌ను నమ్మితే ఎదుగుదల సుసాధ్యం. మురుగన్‌ను నమ్మితే శక్తి వస్తుంది. స్కంధ షష్టి కవచం మన మనస్సును ఉక్కుగా చేస్తుంది. మన జీవితాన్ని మధురంగా మార్చుతుందని అన్నారు. ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు. ఒక ముస్లిం కూడా వారి మతాన్ని గౌరవించవచ్చు. కానీ హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం అభ్యంతరం? హిందు ధర్మాన్ని, హిందూ దేవతలను చులకన చేస్తారు. వారిది సెక్యులరిజం కాదు… సూడో సెక్యులరిజమని విమర్శించారు. ప్రపంచపు తొలి విప్లవ నాయకుడు మురుగన్. మురుగన్‌కు బేధభావం లేదు. అందరూ సమానమేనని పేర్కొన్నారు.ఈ తరం వారు మధురై గురించి తెలుసుకోవాలన్నారు.
ప్రతివారినీ సమానంగా చూడటం ధర్మం:మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్
By admin1 Min Read