కోట్లాది మంది ఆకాంక్షలు, ఆశీస్సులతో భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి పయనమయ్యారు. ఫ్లోరిడా లోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో భారత అంతరిక్ష చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా తో పాటు మరో ముగ్గురితో యాక్సియం4 రోదసికి బయలుదేరింది. భారత కాలమానం ప్రకారం నేటి మధ్యాహ్నం 12.01 గంటలకు చేపట్టిన ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. మే 29న జరగాల్సిన ఈ ప్రయోగం పలు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నేడు విజయవంతంగా పూర్తయింది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్ ను చేపట్టింది. భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), యూరప్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహించాయి. శుభాంశు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్ (అమెరికా), స్పెషలిస్టులు టిబర్ కాపు (హంగరీ), స్లావోస్ట్ ఉజ్నాన్స్కీ- విస్నియెస్కీ (పోలండ్) అంతరిక్షంలోకి వెళ్లారు. ఈ ప్రయోగంలో శుభాంశు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
చరిత్ర సృష్టించిన భారత ఆస్ట్రోనాట్… రోదసి లోకి శుభాంశు శుక్లా
By admin1 Min Read
Previous Article‘ది ఎమర్జెన్సీ డైరీస్’ పేరిట పుస్తకం… తెలిపిన ప్రధాని మోడీ
Next Article శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి