భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్ మాన్ గిల్ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో మరింత మెరుగైన ర్యాంకు చేరాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో అద్భుత ప్రదర్శనతో సత్తాచాటుతున్న గిల్ కెరీర్ లోనే తొలిసారిగా టాప్-10లోకి దూసుకొచ్చాడు. తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ జాబితాలో ఏకంగా 15 స్థానాలు మెరుగుపరుచుకుని అతడు 6వ ర్యాంకు చేరుకున్నాడు. ఇంగ్లాండ్ మొదటి రెండు టెస్టుల్లో గిల్ 585 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అందులో మూడు సెంచరీలున్నాయి. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4, వి కీపర్ రిషబ్ పంత్ 7 స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్ జాబితాలో స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా నెంబర్ వన్ ర్యాంకులను నిలబెట్టుకున్నారు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహితశర్మ 3, విరాట్ కోహ్లి 4, శ్రేయస్ అయ్యర్ 8వ స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్లో కుల్డీప్ యాదవ్ 2, రవీంద్ర జడేజా 9, మహ్మద్ షమి 13, సిరాజ్ 14వ స్థానాలో ఉన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు