భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆలౌటయింది. జో రూట్ 104 (109; 10×4) సెంచరీతో రాణించాడు. కార్సే (56), స్మిత్ (51) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. స్టోక్స్ (44), ఓలి పోప్ (44) పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో మరోసారి జట్టుకు బలంగా నిలిచాడు. సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. జడేజా 1 వికెట్ తీశారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. జైశ్వాల్ (13), శుభ్ మాన్ గిల్ (16), కరుణ్ నాయర్ (40) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం కే.ఎల్.రాహుల్ (53 బ్యాటింగ్), రిషబ్ పంత్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓక్స్, స్టోక్స్, ఆర్చర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇప్పటికే ఈ సిరీస్ లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు లార్డ్స్ టెస్టులో గెలిచి సీరీస్ లో పట్టు బిగించాలని భావిస్తున్నాయి.
లార్డ్స్ టెస్టు: ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ 387 ఆలౌట్…5 వికెట్లతో చెలరేగిన బుమ్రా
By admin1 Min Read