భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఎన్నిసార్లు విన్నా…ఆ కథా నేపథ్యంతో ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులకు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ రామాయణాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్న విషయం తెలిసిందే. రామ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ తదితరులు లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘రామాయణ’ పేరుతో ప్రతిష్ఠాత్మకంగా ఇది రూపొందుతోంది. తాజాగా దీని బడ్జెట్ ను నిర్మాత నమిత్ మల్హోత్రా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఏకంగా రూ.4000 కోట్లతో దీన్ని నిర్మించనున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇప్పటివరకూ ఇంత భారీ బడ్జెట్ తో భారతీయ సినిమాలు తెరకెక్కలేదన్న నమిత్ ‘రామాయణ’ చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉందన్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా సుమారు రూ.4000 కోట్లతో రూపొందించనున్నాం. ప్రపంచమంతా ఈ ఇతిహాసాన్ని చూడాలన్న లక్ష్యంతోనే దీన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నాం. తరాలు మారినా, యుగాలు మారినా రామాయణం ఎప్పటికీ గొప్ప ఇతిహాసమేనని నిర్మాత తెలిపారు.
భారతీయ చిత్రాల్లోనే అత్యధిక బడ్జెట్…రూ.4000 కోట్లతో తెరకెక్కుతున్న ‘రామాయణ’
By admin1 Min Read